కరోనా మందుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై కృష్ణపట్నం ఆనందయ్య స్పందించారు. తన మందుకు ఇంకా అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు ప్రస్తుతం సిద్దంగా లేవని వెల్లడించారు. ఎవరూ వదంతులు నమ్మి కృష్ణపట్నం గ్రామానికి రావొద్దని కొరారు.
Anandaiah Medicine: మందుకు ఇంకా అనుమతులు రాలేదు: ఆనందయ్య - ఏపీ తాజా వార్తలు
15:14 May 28
సోషల్ మీడియా, కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు అవాస్తవం
మరోవైపు ఆనందయ్య మందును ఆయుష్ భిన్న కోణాల్లో పరిశీలిస్తోంది. ఆయుర్వేద వైద్య విభాగంలో ఆనందయ్య.. వైద్యుడిగా నమోదైతే తప్ప ఇటువంటి వైద్య ప్రక్రియ, మందుల తయారీకి ఆయుష్ అనుమతులు మంజూరు చేయదు. ఇప్పుడు అలాంటి ఓ పరిస్థితిని ఆనందయ్య ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే మందు కోసం డిమాండ్ పెరుగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య మందును పూర్తిగా నిర్ధరించిన తరువాత మాత్రమే.. తయారీకి అనుమతులు మంజూరు చేయాలి. నియమ, నిబంధనలతో పాటు వాస్తవ పరిస్థితుల ప్రతిపాదికన ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఆనందయ్య మందుపై బహుముఖ కోణాల్లో వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏది ప్రమాణికమో, ఏది కాదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆనందయ్య మందు ఆయుర్వేదం కానప్పటికీ.. ఆరోగ్యానికి హానీ లేదని ఆయుష్ కమిషనర్ రాములు మౌఖికంగా ధ్రువీకరించిన తరువాత.. మందును తీసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లో పెరిగింది.
ఇదీ చదవండి
ఆనందయ్య మందుపై తొలిదశ అధ్యయనం పూర్తి.. సీసీఆర్ఏఎస్ కు నివేదిక