ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి అమరావతి రైతుల సంఘీభావం - అమరావతి రైతులు నెల్లూరులో కోటంరెడ్డిని కలిశారు

Amaravati Farmers Met Kotam Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులు సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా నెల్లురులోని ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి కలిశారు. అనంతరం మందడ గ్రామానికి చెందిన రైతులు మీడియా సమావేశం లో మాట్లాడారు.. అంబాపురంలో వర్షానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పరామర్శించారని.. అమరావతి రాజధానికి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో మమ్మల్ని కలిశారు. ఆయనపై కృతఙ్ఞతగా నెల్లూరుకు వచ్చామని అన్నారు.

అమరావతి రైతులు
అమరావతి రైతులు

By

Published : Feb 5, 2023, 9:32 PM IST

Amaravati Farmers Met Kotam Reddy: వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని.. నెల్లూరులో అమరావతి రైతులు కలిసి సంఘీభావం ప్రకటించారు. అమరావతికి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే తమకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. అంబాపురంలో వర్షానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వచ్చి పరామర్శించారని అన్నారు. అందుకు కృతజ్ఞతగా నెల్లూరుకు వచ్చి ఆయనకు మద్దతు తెలిపినట్లు చెప్పారు. అమరావతి అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతమని.. రాజధానిగా అమరావతే ఉంటుందని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కలిసిన అమరావతి రైతులు

ABOUT THE AUTHOR

...view details