తెదేపా కార్యకర్తపై దాడి.. పరామర్శించిన అఖిలపక్షం తెదేపా నేత వెంగళరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మెరుగైన చికిత్స కోసం ఆయనను డాక్టర్ ప్రభాకర్ నాయుడు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వెంగళరెడ్డిని అఖిలపక్ష నేతలు పరామర్శించారు. వెంగళరెడ్డిపై వైకాపా దాడిని పిరికిపంద చర్యగా సీపీఐ నాయకులు దామా అంకయ్య అభివర్ణించారు.
తెదేపా కార్యకర్తపై దాడి.. పరామర్శించిన అఖిలపక్షం అదే కావాలంటే తాము సిద్ధం..
వైకాపా నేతల దాడికి ముందు టార్గెట్ చేసిన వారిపై కేసు పెట్టి అనంతరం దాడికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత చింతాల వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు. తమది ఫ్యాక్షన్ సంస్కృతి కాదని.. వైకాపాకు అదే కావాలంటే తాము సిద్ధంగా ఉన్నామని తెదేపా నియోజకవర్గ బాధ్యులు కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక్కడ గాజులు తొడుక్కుని ఎవరు లేరని ఆయన మండిపడ్డారు. వెంగళరెడ్డిపై దాడి కేసులో పోలీసులు నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి :
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు