ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఏఏ, ఎన్​ఆర్​సీ బిల్లులకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన - all party candle display against the Citizenship Bill at nelloore

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎన్ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలిలో భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు.

all party candle rally against the Citizenship Bill
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన

By

Published : Jan 30, 2020, 8:51 AM IST

సీఏఏ, ఎన్​ఆర్​సీ బిల్లులకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో ర్యాలీ చేస్తూ భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు రోజులపాటు బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వెంకటయ్య, మన్సూర్, సమద్, జాషువా పౌరసత్వ సవరణ చట్టం వల్ల తలెత్తే పరిణామాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి తెదేపా, యూటీఎఫ్ నాయకులు సంఘీభావం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details