నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లిలో మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు వీరంగం సృష్టించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని బలవంతంగా ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నారు. యువతి ప్రతిఘటించటంతో కొంతదూరం తర్వాత వదిలేశారు. గమనించిన స్థానికులు యువకులను వెంబడించి ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసుకొని పరారైన పోకిరీల కోసం గాలిస్తున్నారు.
మద్యం మత్తులో వీరంగం...యువతి పట్ల అసభ్య ప్రవర్తన - Alcohol and intoxication
స్త్రీ అర్థరాత్రి నిర్భయంగా నడిచిన రోజే... నిజమైన స్వాతంత్య్రమన్నాడు మహాత్ముడు. అర్థరాత్రి కాదు కదా... నేడు పట్టపగలే నడవలేని దుస్థితి ఏర్పడింది ఆడపిల్లకు. మద్యం మత్తులో తూళుతున్న మానవ మృగాలు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అమానవీయ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో వీరంగం