నెల్లూరులో వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆందోళన చేపట్టింది. ముస్లింల సంక్షేమం కోసం పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.
వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షించాలని ఏఐవైఎఫ్ ఆందోళన - nellore latest updates
వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని సంతపేట వద్ద ఏఐవైఎఫ్ ఆందోళన చేపట్టింది. మస్లింల సంక్షేమం కోసం పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు లో ఏఐవైఎఫ్ ఆందోళన
స్థలం ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్తుల పరిరక్షణ కోసం అధికారులు చర్యలు చేపట్టే వరకు తాము ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు.