వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు కోవూరు, కొడవలూరు మండలాల్లో పర్యటించారు. పంటలను పరిశీలించారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పలకరించారు. రంగుమారిన ధాన్యం పరిస్థితిని చూశారు. మిల్లర్ల వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రైతులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. రైతులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతులు మోసపోవద్దని సూచించారు.
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ కమిషనర్ - Nellore Farmers Latest news
నెల్లూరు జిల్లా కోవూరు, కొడవలూరు మండలాల్లో వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు పర్యటించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతుల అధైర్యపడవద్దని, న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ కమిషనర్