ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ బడులకు జాయింట్ కలెక్టర్ పిల్లలు

ప్రభుత్వ పాఠశాలలు.. ప్రైవేట్ స్కూళ్ల కంటే ఏ మాత్రం తక్కువ కాదని నెల్లూరు జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందిస్తున్నారని జేసీ కొనియాడారు.

Admission of nelore  Joint Collector children in government schools
Admission of nelore Joint Collector children in government schools

By

Published : Dec 3, 2020, 2:51 PM IST

సర్కారు బడులపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు నెల్లూరు జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రభాకర్‌రెడ్డి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో అన్ని వసతులతో నాణ్యమైన బోధన అందుతోందని.. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు జేసీ తెలిపారు. బుధవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి లక్ష్మీ తన కుమార్తె ఎన్‌.అలెక్స్‌శృతిని.. దర్గామిట్ట జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించారు. కుమారుడు ఎన్‌.క్రిష్‌ధరణ్‌రెడ్డిని ఏకేనగర్‌లోని స్పిన్నింగ్‌ మిల్‌ కాలనీలోని మున్సిపల్‌ స్కూల్లో నాలుగో తరగతిలో చేర్చారు. డీఈవో పి.రమేష్‌ సమక్షంలో ప్రవేశం కల్పించారు.

స్పిన్నింగ్‌ మిల్‌ కాలనీలోని మున్సిపల్‌ స్కూల్లో చేరుతున్న జేసీ కుమారుడు
దర్గామిట్టలోని జడ్పీ పాఠశాలలో చేరుతున్న జేసీ కూతురు శృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details