నెల్లూరులో సినీనటి రాశీ ఖన్నా సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వర్తూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ లేఅవుట్ బ్రోచర్‌ను ఆవిష్కరించి, సంస్థ ప్రతినిధులను సన్మానించారు.
నెల్లూరులో నటి రాశీ ఖన్నా సందడి - నెల్లూరు నగరం వార్తలు
నెల్లూరు నగరంలో సినీనటి రాశీ ఖన్నా సందడి చేశారు. లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. ఓ సంస్థ లేఅవుట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
సినీనటి రాశిఖన్నా సందడి
వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా ఎన్నో వెంచర్లను వర్తూసా గ్రూప్ ఏర్పాటు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుందని రాశీ ఖన్నా కొనియాడారు. తాను ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నానని, కరోనా కారణంగా విడుదలకు ఆలస్యం అవుతుందని తెలిపారు. సినీ నటిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి: పీఎస్‌ఎల్‌వీ-సి50 ప్రయోగం విజయవంతం