శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యేకి ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్, గన్‌మెన్‌కి స్వల్ప గాయాలయ్యాయి. చెన్నై నుంచి గూడూరుకు వస్తుండగా నాయుడుపేట సమీపంలో ప్రమాదం జరిగింది.
గూడూరు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం - గూడురు ఎమ్మెల్యేకు రోడ్డు ప్రమాదం
నెల్లూరులోని గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ప్రమాదం జరిగింది.
![గూడూరు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం accident to guduru mla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9155564-816-9155564-1602563148201.jpg)
గుడూరు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
మల్లాం క్రాస్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేకు వేయటంతో.. ఎమ్మెల్యే కారు అదుపు తప్పి మరో లారీని ఢీకొట్టింది. అక్కడనుంచి వేరే వాహనంలో ఎమ్మెల్యే గూడూరు నివాసానికి చేరుకున్నారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం
Last Updated : Oct 13, 2020, 10:20 AM IST