.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, 8 మంది దుర్మరణం - road accident at nellore
![నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, 8 మంది దుర్మరణం road accident at nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11187826-460-11187826-1616894938390.jpg)
09:25 March 28
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
06:30 March 28
శ్రీశైలం నుంచి నెల్లూరు వైపు వెళ్తుండగా ఘటన
నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 14 మందిలో.. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. వీరంతా శ్రీశైలం నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో ఐదు మంది మహిళలు ముగ్గురు పురుషులు ఉన్నారు.
ఇదీ చదవండి
11 నెలల్లో రూ.79,191 కోట్ల రుణం.. దేశంలోనే ఇది అత్యధికం!