నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్‌ప్లాజా వద్ద ఏపీ మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని మిగతా వాహనాలు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. దీంతో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురం వద్ద హై లెవెల్ కెనాల్ ఫేజ్-2 పైలాన్ ప్రారంభోత్సవానికి మంత్రులు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో మంత్రులకు ఎలాంటి ఆపద వాటిల్లలేదు. కాన్వాయ్‌లోని చివరి వాహనాలే దెబ్బతిన్నాయి. కొద్ది సేపటి తర్వాత మంత్రులు అక్కడి నుంచి తిరిగి బయల్దేరి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ మంత్రుల కాన్వాయ్కి ప్రమాదం.. 3 వాహనాలు ధ్వంసం - ఏపీలో మంత్రులకు తప్పిన ముప్పు
ఏపీ మంత్రుల కాన్వాయ్‌లో వాహనాలు ఢీకొన్నాయి. అకస్మాత్తుగా కాన్వాయ్‌లోని మొదటి వాహనం బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో ఒకదానికొకటి ఢీకొని 3 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మంత్రులకు ఎటువంటి ఆపద వాటిల్లలేదు.
![ఏపీ మంత్రుల కాన్వాయ్కి ప్రమాదం.. 3 వాహనాలు ధ్వంసం accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9483882-7-9483882-1604903643057.jpg)
accident