ACB Raids in Nellore : నెల్లూరు సివిల్ సప్లయ్స్ కుంభకోణంపై... అవినీతి నిరోధక శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 8 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. సివిల్ సప్లయ్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల నివాసాల్లో... ఈ సోదాలు సాగాయి. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాల ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ తనిఖీలు నిర్వహించింది. అక్రమాల ఆరోపణలతో నెల్లూరు జిల్లా పౌరసరఫరాల సంస్థ మాజీ డీఎం పద్మ, కంప్యూటర్ ఆపరేటర్ శివ సస్పెన్షన్కు గురయ్యారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని శివకుమార్ నివాసంలో సోదాలు చేసేందుకు వచ్చిన అధికారులు... ఇంటికి తాళం వేసి ఉండటంతో కొద్దిసేపు బయటే వేచి ఉన్నారు. తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించి సోదాలు నిర్వహించారు. విజయవాడలోని పద్మ మావయ్య ఇంట్లోనూ అనిశా తనిఖీలు నిర్వహించింది.
ACB Raids: నెల్లూరు సివిల్ సప్లయ్స్ కుంభకోణం.. ఏసీబీ తనిఖీలు - నెల్లూరులోని 8 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు
ACB Raids in Nellore : నెల్లూరు సివిల్ సప్లయ్స్ కుంభకోణంపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. జిల్లాలోనే 8 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అసలేం జరిగిందంటే..?
ఏసీబీ తనిఖీలు