నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో అనిశా తనిఖీలు అధికారులను బెంబేలెత్తిస్తున్నాయి. బాధితులు కొందరు ఇచ్చిన పక్కా సమాచారంతో అనిశా బృందం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగం రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బృందాల సిబ్బంది రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగం లోని అన్ని సెక్షన్ ల వద్ద రికార్డులను తనిఖీలు చేసారు. దాంతో ఆ విభాగం అధికారులలో కలకలం మొదలైంది.
నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో అనిశా తనిఖీలు - నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో అనిశా తనిఖీలు
15:34 August 18
NLR_ACB searchs_Municipal_Breaking
గతంలో పలుమార్లు అవినీతిపై ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్ సైతం అక్కడి అధికారులను సిబ్బందికి హెచ్చరికలు చేశారు. అయినా నగర పాలక సంస్థలో అక్రమాలు ఆగలేదు .
కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ రెవిన్యూ విభాగాల వద్దకు చేరుకుని అక్కడ పలు రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఈ విభాగంలో సిబ్బంది వద్ద ఏమైనా నగదు ఉందా అన్న విషయాలను కూడా పరిశీలించారు. ప్రస్తుతం రికార్డుల తనిఖీ ముమ్మరంగా జరుగుతోంది.
ఇదీ చదవండి:ఆండ్రూస్ కంపెనీ గనుల తవ్వకాలపై లోతుగా విచారణ: గోపాల కృష్ణ ద్వివేదీ
TAGGED:
acb raids in nellore