ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీఎస్పీడీసీఎల్ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు - apspdcl

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో నెల్లూరు ఏపీఎస్పీడీసీఎల్ ల్లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నెమళ్ళపూడి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు.

నెల్లూరులో ఏసీపీ దాడులు

By

Published : Feb 5, 2019, 4:45 PM IST

నెల్లూరులో ఏసీపీ దాడులు
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో నెల్లూరు ఏపీఎస్పీడీసీఎల్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నెమళ్ళపూడి ప్రభాకర్ రెడ్డి ఇంటి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరులోని ప్రభాకర్ రెడ్డి ఇంటితో పాటు, ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం, చిట్టమూరు మండలంలోని ఆయన మామ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య కళ్యాణి పేర్లతో 9 ఇళ్ల స్థలాలు, ఒక బహుళ అంతస్తుల భవనం, కారు, రెండు స్కూటర్లు ఉన్నట్లు గుర్తించారు. మామ వాసుదేవా రెడ్డి పేరుతో 26 ఎకరాల భూమి, ఓ స్థలం, అత్త సుగుణమ్మ పేరుతో మరో స్థలంకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అర కేజీ బంగారు నగలు, రెండు కిలోల వెండి వస్తువులతో పాటు కొంత నగదు బయటపడగా, రెండు లాకర్లు తెరవాల్సి ఉంది. ప్రభాకర్రెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details