నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లి పంచాయతీ సెక్రటరీ కృష్ణ మాధురి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. బిల్లు మంజూరు చేయడానికి రూ.4వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు రమణయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రమణయ్య వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
Corruption: ఏసీబీ వలలో ఎడవల్లి పంచాయతీ సెక్రటరీ - ఏసీబీ వలలో చిక్కిన ఎడవల్లి పంచాయతీ సెక్రటరీ
నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లి పంచాయతీ సెక్రటరీ కృష్ణ మాధురి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ బిల్లు మంజూరు చేయాడానికి.. రూ.4వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు చిక్కారు.
ఏసీబీ వలలో ఎడవల్లి పంచాయతీ సెక్రటరీ
బాధితుడు రమణయ్య పంచాయతీ సెక్రెటరీ వేధింపులు తాళలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించి నట్లు తెలిపారు. గ్రామస్థులు మాత్రం పంచాయతీ సెక్రటరికి మద్దతునిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే మాధురిని ఇరికించారని ఆరోపించారు.
ఇదీ చదవండి:'అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రాణహాని'