2019లో పలు కార్యాలయాలకు తాము అనిశా అధికారులమంటూ కొందరు వ్యక్తులు ఫోన్ చేసి నగదు డిమాండ్ చేశారు. నిజమని నమ్మిన అధికారులు.. వారి ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావటంతో అధికారులు సోదాలు చేపట్టారు. నెల్లూరులోని వాణిజ్య పన్నుల కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్ రూ.30 వేలు చెల్లించారన్న సమాచారంతో అతన్ని ప్రశ్నిస్తున్నారు.
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అనిశా సోదాలు
నెల్లూరులోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో... అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ అనిశాకు నగదు చెల్లింపులు చేశారన్న ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు