ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో నెంబర్ 77కు వ్యతిరేకంగా ఏబీవీపీ నిరసనలు - జీవో నెంబర్ 77 కు వ్యతిరేకంగా ఏబీవీపీ నిరసన తాజా వార్తలు

నెల్లూరు జిల్లాలో జీవో నెంబర్ 77కు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం వెంటనే 77 జీవోను ఉపసంహరించి.. విద్యార్థులకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా కన్వీనర్ రాజశేఖర్ డిమాండ్ చేశారు.

ABVP protests against Jivo No.77
జీవో నెంబర్ 77 కు వ్యతిరేకంగా ఏబీవీపీ నిరసనలు

By

Published : Dec 29, 2020, 10:36 PM IST

జీవో నెంబర్ 77కు వ్యతిరేకంగా నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నగరంలోని వీఆర్​సీ సెంటర్ వద్ద ఏబీవీపీ నాయకులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో వైకాపా ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ రాజశేఖర్ ధ్వజమెత్తారు. ఐఐటి నుంచి పిహెచ్​డి వరకు ఉచితంగా చదివిస్తామని జీవో నెంబర్ 105ను తీసుకువచ్చి.. ఇప్పుడు స్కాలర్​ షిప్​లు రానివ్వకుండా.. 77 జీవో తీసుకురావటంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నత విద్య చదివే పేద విద్యార్థులకు స్కాలర్ షిప్​లు రాకపోతే.. వారు చదువులకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే 77 జీవోను ఉపసంహరించి.. విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details