విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. కరోనా పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ ఆరోపించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.
నెల్లూరులో రాస్తారోకో నిర్వహించిన ఏబీవీపీ - nellore latest news
విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని నెల్లూరులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆందోళ చేపట్టింది. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే శాసనసభ్యుల ఇళ్లను ముట్టడిస్తామని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ హెచ్చరించారు.
నెల్లూరులో రాస్తారోకో నిర్వహించిన ఏబీవీపీ
ప్రైవేట్ ఉపాధ్యాయులకు పదివేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. నాడు, నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయని, నిధులు లేక చాలా పాఠశాల్లో పనులు ఆగిపోయాయని తెలిపారు. ఇప్పటికై ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి