ఇటీవల నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్గా నియమితులైన అబ్దుల్ అజీజ్... శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత నగరంలోని తన నివాసం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తెదేపా కార్యాలయానికి వచ్చారు. కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరిని కలుపుకుపోయి జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేస్తామని అజీజ్ వెల్లడించారు.
జిల్లాలో తెదేపాను బలోపేతం చేస్తాం: అబ్దుల్ అజీజ్ - tdp leader somireddy chandramohan reddy news
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెదేపాను బలోపేతం చేస్తామని ఆ పార్టీ నేత అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్గా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ సమావేశంలో ప్రసంగించిన సోమిరెడ్డి... వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని... ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిన వారిపై కేసులు పెట్టి వేధించే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఎడగారు సీజన్లోనే జిల్లా రైతులు 800 కోట్ల రూపాయలు నష్టపోయారని ఆయన చెప్పారు. అన్నదాతల నుంచి 9 వేల రూపాయలకే ధాన్యం కొనుగోలు చేసి, 15,600 రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. నరేగా బిల్లుల చెల్లింపు విషయంలో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై ఉత్తరాల ఉద్యమం చేపడుతామన్నారు. ఉప రాష్ట్రపతి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి నెల్లూరు జిల్లా నుంచి 10 వేల లేఖలు పంపుతామని ప్రకటించారు.
ఇదీ చదవండి: అధికారులు చేస్తున్నదానికి రెట్టింపు సన్మానం చేస్తా: జేసీ దివాకర్ రెడ్డి