Suicide: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుచ్చిలో నివాసముంటున్న శీనయ్య, గ్రీష్మ దంపతుల రెండో కుమార్తె.. డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులతో ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోడపై సూసైడ్ నోట్ రాసి.. ఉరేసుకుంది. అక్కా.. అమ్మ, నాన్నలను బాగా చూసుకో... అమ్మా నాన్న సారీ.. మీ మాట విననందుకు అని గోడపై రాసింది.
అక్కా... అమ్మ, నాన్నను బాగా చూసుకో.. మీ మాట విననందుకు - డిగ్రీ విద్యార్దిని ఆత్మహత్య
Suicide: ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. మీ మాట విననందుకు నన్ను క్షమించండి అమ్మ, నాన్న అంటూ గోడపై రాసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది.
suicide
ఇంటికి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు. కుమార్తె మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కలిచి వేసింది.
ఇవి చదవండి: