ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా జీవనాధారం దూరం చేయొద్దు..'

గుప్పెడు అన్నం మనకి పెట్టడానికి రైతులు పడే కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. అదే పొలాన్ని రైతు నుంచి ఎవరైనా లాగేసుకుంటే... ఆ భూమిని ఇళ్ల స్థలంగా మార్చేస్తున్నామని చేప్తే... ఆ అన్నదాత పడే ఆవేదనకి అంతే ఉండదు. ఆ దిగులుతోనే ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన... నెల్లూరు జిల్లా గండవరం మండలంలో జరిగింది.

a women comes self burnt due to field problems at nellore
మనస్థాపంతో యువతి ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 6, 2020, 6:58 AM IST

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, గండవరం గ్రామంలోని ఓ మహిళా రైతు ఆత‌్మహత్యాయత్నం చేసింది. తన భూమిని ఇళ్ల స్థలాల కోసం తీసుకుంటున్నారని రమణమ్మ అనే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది.

ఈమె 50 ఏళ్లుగా గ్రామంలో కొంత భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే... ఇటీవల అధికారులు ఆ భూమిని ఇళ్ల స్థలాల కోసం తీసుకుంటున్నట్లు చెప్పటంతో, తీవ్ర ఆవేదనకు లోనైన ఆమె... ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని, స్టేషన్​కు తరలించారు. తన జీవనాధారాన్ని దూరం చేయొద్దంటూ ఆమె అధికారులను వేడుకుంటోంది.

ఇవీ చూడండి

ఇకపై జేసీలకు బల్క్ అనుమతుల అధికారం

ABOUT THE AUTHOR

...view details