ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు బావిలో పడిన మహిళ... రక్షించిన అగ్నిమాపక సిబ్బంది - నెల్లూరు తాజా వార్తలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కచేరిమిట్టలో ప్రమాదవశాత్తు బావిలో పడిన బి.కుమారి అనే మహిళను అగ్నిమాపక అధికారులు సిబ్బంది రక్షించారు.

Women in Well
ప్రమాదవశాత్తు బావిలో పడిన మహిళ... రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

By

Published : Jul 25, 2020, 6:12 PM IST

ప్రమాదవశాత్తు బావిలో పడిన మహిళ... రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కచేరిమిట్టలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ మహిళ బావిలో పడింది. విషయం తెలుసుకున్న కావలి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే బావిలోకి దిగారు. మహిళకు తాళ్లను బిగించి నెమ్మదిగా పైకి లాగారు. అనంతరం మహిళకు ప్రథమ చికిత్స చేయించారు. తన ప్రాణాలను రక్షించిన అగ్నిమాపక సిబ్బందికి మహిళ కృతజ్ఞతలు తెలిపింది.

ఇవీ చూడండి-చూస్తుండగానే..వాగులో కొట్టుకుపోయిన ఇంటర్​ విద్యార్థి

ABOUT THE AUTHOR

...view details