ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సెంట్రల్ డిజైనింగ్ నిపుణుల కమిటీ - Central Designing Experts Committee examined the Somshila Reservoir news

సోమశిల జలాశయాన్ని సెంట్రల్ డిజైనింగ్ నిపుణుల కమిటీ బృందం పరిశీలించింది. దెబ్బతిన్న ప్రాంతాలన్నీ పరీక్షించామని.. ప్రాథమికంగా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని నిపుణుల బృందం తెలిపింది.

Central Designing Experts Committee
జలాశయాన్ని పరిశీలిస్తున్న నిపుణుల బృందం

By

Published : Jan 10, 2021, 8:17 PM IST

ఇటీవల తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వరదలు పోటెత్తాయి. జిల్లాలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తింది. నీటి మట్టం పెరగటంతో దిగువకు సుమారు 250 టీఎంసీల నీరు విడుదల చేశారు. జలాశయం ఆఫ్రాన్ ప్రాంతంతో పాటు పొర్లు కట్టలు కూడా కొంతమేర దెబ్బతిన్నాయి.

దెబ్బతిన్న జలాశయం ప్రాంతాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ డిజైనింగ్ అండ్ సేఫ్టీ విభాగానికి సంబంధించిన బృందాన్ని ప్రభుత్వం సోమశిలకు పంపింది. బీఎస్ఎన్ రెడ్డి నేతృత్వంలో జియోలాజికల్ సర్వే పుణే డైరెక్టర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల బృందం రిజర్వాయర్​ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జలాశయానికి సంబంధించిన సీఈ, ఎస్​ఈ, ఈఈ స్థాయి అధికారులతో సమీక్షించారు.

సోమశిల జలాశయం చాలా పటిష్టంగా ఉందని నిపుణుల బృందం తెలిపింది. మునుపెన్నడూ లేని విధంగా నీటిని విడుదల చేయాల్సి రావడంతో ఆఫ్రాన్ దెబ్బతిందని అన్నారు. దెబ్బతిన్న ప్రాంతాలన్నీ పరిశీలించినట్లు వెల్లడించారు. ప్రాథమికంగా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: 11న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన.. ఏర్పాట్లపై మంత్రుల పర్యవేక్షణ

ABOUT THE AUTHOR

...view details