నిత్య విద్యార్థి, అంతులేని ప్రతిభ, అంతకుమించి కృషి పట్టుదల. అవన్నీ కలిపితే ప్రభాకర్ రెడ్డి దేశంలోనే అత్యుత్తమ మార్షల్ ఆర్ట్స్‌లో తనకంటూ స్థానం సంపాదించారు. భిన్నమైన ఆలోచనతో ప్రపంచంలోనే ఎవరూ సాధించలేని రికార్డులు సృష్టించారు. 21 గిన్నిస్ రికార్డులు 3 లిమ్కా బుక్ రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నారు. అలాగే పది మందికి శిక్షణ ఇస్తూ వారినీ ఆ దిశగా ప్రోత్సహిస్తారు.
ఇలా మొదలైంది....
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రభాకర్ రెడ్డి... తండ్రి శంకర్ ప్రోత్సాహంతో 11 ఏళ్ళ నుంచే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. జాతీయ స్థాయిలో బహుమతులు గెలిచారు. 17ఏళ్ళ వయస్సు నుంచే కరాటే మాస్టర్‌గా నెల్లూరులో శిక్షణా కేంద్రం ప్రారంభించారు. వేల మందికి తర్ఫీదు ఇచ్చారు. ఓ ప్రత్యేకమైన లక్ష్యంతోనే రికార్డులు సాధిస్తున్నట్టు చెబుతున్నారీ మార్షల్ మాష్టార్.