75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం పలువురుని ఆకట్టుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇసుకపై చేసిన జాతీయ నాయకుల శిల్పాలు అబ్బురపరిచాయి.
INDEPENDENCE DAY SPECIAL: జాతీయ నాయకుల చిత్రాలతో సైకత శిల్పం - Independence Day celebrations at Nellore Police Parade Ground
నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ సైకత శిల్పంలో జాతీయ నాయకుల శిల్పాలు కనువిందు చేస్తున్నాయి.
జాతీయ నాయకుల చిత్రాలతో సైకత శిల్పం
చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన మంచాల సనత్ కుమార్ ఈ సైకత శిల్పాన్ని మలిచారు. ఈ సైకత చిత్రాలలో గాంధీ, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, నేతాజీల శిల్పాలున్నాయి. ప్రజలందరికీ ఈ సైకత శిల్పం ద్వారా 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చదవండీ..ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకలు.. ఆకట్టుకుంటున్న డ్రోను విజువల్స్