ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధికోసం వెళ్తే ... ఊపిరి ఆగింది! - nelloor district.

పొట్టకూటికోసం ఓ వ్యక్తి ఫ్యూషన్ బ్లాక్స్ వెయిట్ లెస్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీ పని మీద వారం రోజుల క్రితం పక్కరాష్ట్రానికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు .. శవమై తిరిగివచ్చాడు.

ప్వాక్టరీ ఎదుట నిరసన చేస్తున్న కుటుంబసభ్యులు

By

Published : Jul 29, 2019, 4:22 AM IST

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలోని ఫ్యూషన్ బ్లాక్స్ వెయిట్ లెస్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో నల్లయగారిపాలెం గ్రామానికి చెందిన తాళ్లపాక చిన పెంచలయ్య (47) పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఓ కంపెనీకి బ్రిక్స్ పంపిణీ చేసేందుకు ఆయన చెన్నై వెళ్లారు. అయితే శుక్రవారం వారి కుటుంబసభ్యులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫోన్ చేసి పెంచలయ్యకు ఓ ప్రమాదంలో గాయాలయ్యాయి అని చెప్పారు. బ్రిక్స్​ని దించే క్రమంలో అవి అతని మీద పడి గాయపడ్డాడని వారికి వెల్లడించారు. చెన్నైలోని ప్రభుత్వ వైద్యశాలలో పెంచలయ్యను చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు చెన్నైకు వెళ్లి మృతదేహాన్ని ఆదివారం తీసుకువచ్చారు. యాజమాన్యం బాధ్యతా రహితంగా వ్యవహరించిందని ఫ్యాక్టరీ వద్ద మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పెంచలయ్య కుటుంబానికి పరిహారం చెల్లించే వరకు కదిలేది లేదని నిరసనకు దిగారు. మృతిపై బాధిత కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details