నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కట్టుబడిపాలెం గ్రామంలో నివాసముంటున్న ఏడుకొండలు అనే వ్యక్తి రాత్రి మద్యం మత్తులో వీరంగం చేశాడు. స్థానిక పోలేరమ్మ గుడి వద్ద భక్తులతో గొడవకు దిగి.. కత్తి, సుత్తి పట్టుకొని పలువురుపై దాడికి ప్రయత్నించాడు. భయాందోళనకు గురైన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఏడుకొండలు తరచూ మద్యం తాగి గ్రామంలో వీరంగం సృష్టిస్తున్నాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మద్యం మత్తులో వ్యక్తి హల్ చల్.. - nellore district updates
మద్యం మత్తులో ఓ వ్యక్తి హాల్ చల్ చేశాడు . కత్తి, సుత్తితో స్థానికులపై దాడికి యత్నించాడు. భయాందోళనకు గురైన స్థానికులు, ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది

మద్యం మత్తులో హల్ చల్