ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MURDER: రాత్రి మేడపై నిద్రించాడు.. తెల్లవారేసరికి..! - Muthialapadu murder case latest

ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడులో ఈ విషాద ఘటన జరిగింది.

murder
యువకుడి దారుణ హత్య

By

Published : Sep 14, 2021, 6:58 PM IST

నెల్లూరు జిల్లా కోట మండలం లక్ష్మకండ్రిగకు చెందిన కాకు దయాకర్​​ అనే యువకుడు కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్​లో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం సోదరి నిశ్చితార్థం ఉండడంతో సొంత గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో చిల్లకూరు మండలం ముత్యాలపాడులో ఉంటున్న మేనమామ కుమారుడి ఇంటికి వెళ్లి.. రాత్రి వారి ఇంటి మేడ మీద నిద్రపోయాడు. తెల్లవారుజామున అతని బంధువులు వెళ్లి చూడగా దయాకర్ ఒంటి మీద గాయాలతో.. రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కాకు దయాకర్​కి నేరచరిత్ర ఉన్నట్టు కొన్ని కేసుల మీద ఇతను హైదరాబాదులోని చర్లపల్లి జైలులో కొన్ని రోజులు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండీ..DISHA APP: ఒక్క క్లిక్ చేసింది.. అపాయం నుంచి బయటపడింది

ABOUT THE AUTHOR

...view details