ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో దారుణం... ఆలయం చుట్టూ తిప్పి.. కుక్కతో కరిపించి - Inhumanity in Nellore

Inhumanity in Nellore: నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో ఓ యువకుడిపై మరో వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంటి ముందు నుంచి ఇద్దరు యువకులు వెళ్తుండగా.. కుక్క అరిచింది. దీంతో యజమాని కుక్కను విడిచిపెట్టాడు. అందులో ఓ యువకుడిని పట్టుకుని.. దొంగ అనే అనుమానంతో చితకబాదాడు.. తాను దొంగ కాదని... కుక్క వెంటపడగా పరిగెత్తానని చెప్పినా పట్టించుకోలేదు. అతని ప్రవర్తనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు బాధితుడిని వదిలేశాడు.

Thie
Thie

By

Published : Sep 19, 2022, 3:22 PM IST

Attack on youth: నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో దొంగ అనే అనుమానంతో ఓ యువకుడిపై మరో వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధిత యువకుడి మెడకు తాడు బిగించి.. కాళ్లతో తన్నుతూ హింసించాడు. జుట్టు పట్టి ఆలయం చుట్టూ ఈడ్చుతూ దాడి చేశాడు. పెంపుడు కుక్కతో కరిపించాడు. తాను దొంగను కాదని.. కుక్కను వదలడంతో భయపడి పరుగులు తీసినట్లు చెప్పినా వినిపించుకోలేదు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆలయం సమీపంలో నివాసముంటున్న రమేష్ అనే వ్యక్తి ఇంటి ముందు నుంచి ఇద్దరు యువకులు వెళుతుండగా... వారిని చూసి పెంపుడు కుక్క మొరిగింది. రమేష్ తన కుక్కను వదలడంతో.. ఓ యువకుడు పారిపోయాడు. మరొకరు ఆలయంలోకి పరుగులు తీయగా.. వెంటబడి పట్టుకుని దాడికి దిగాడు. రమేష్ ప్రవర్తనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు బాధితుడిని వదిలేశాడు.

నెల్లూరు జిల్లాలో దారుణం... ఆలయం చుట్టూ తిప్పి.. కుక్కతో కరిపించి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details