నెల్లూరు జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాల తర్వాత పారిశ్రామికాభివృద్ధిదే ప్రత్యేక స్థానం. నాయుడుపేట, మేనకూరు, తడ, మాంబట్టు వద్ద సెజ్‌లు ఉండగా- పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలనూ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఆ క్రమంలో వాటికి భూమి అవసరం ఏర్పడగా.. సేకరణపై అధికారులు దృష్టి పెట్టారు.’
*ప్రస్తుతం ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందులో కొన్ని సర్వేల స్థాయిలో ఉండగా- మరికొన్ని ఫీజుబులిటీ నివేదికలు పూర్తి చేసుకుని భూసేకరణ దశలో కనిపిస్తున్నాయి. పాత ప్రాజెక్టుల విషయంలో ప్రక్రియ చివరి దశకు చేరగా- త్వరలోనే భూమిని అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.’
*సీబీఐసీ, వీసీఐసీ, నడికుడి-శ్రీకాళహస్తి, జువ్వలదిన్నె, ఫిషింగ్ హార్బర్, దగదర్తి విమానాశ్రయం తదితరాలను ప్రభుత్వం ప్రాధాన్యతాంశాలుగా గుర్తించింది. ఇక్కడ ప్రభుత్వ, డీకేటీ తదితర భూములు మినహా.. పట్టా భూమిని సేకరించడంపై భూసేకరణ విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టి పని చేస్తోంది.
కావలి మెగా ఇండస్ట్రియల్ హబ్
●●నెల్లూరు- ప్రకాశం జిల్లాల సరిహద్దులో.. (చెన్నాయపాళెం, ఆనెమడుగు, కావలి, తుమ్మలపెంట)
●*●6236.93 ఎకరాలు ● 0
●*సర్వే జరుగుతోంది. పూర్తయ్యాక ఫీజిబులిటీ నివేదిక ఇస్తారు. ఆ తర్వాత భూసేకరణ మొదలవుతుంది. జువ్వలదిన్నె ఫిషింగ్‌హార్బర్, రామాయపట్నం పోర్టు మధ్య ఏర్పాటు కానుంది.
చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ)
కోట, చిల్లకూరు
*మండలాల్లో తమ్మినపట్నం, కొత్తపట్నం
*2430.24 ఎకరాలు
*1251 ఎకరాలు
*1178 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. పరిహారం విలువ నిర్ధరణపై అధికారులు దృష్టిపెట్టారు. గతంలో కొంత సేకరించినా.. ప్రజాభిప్రాయ సేకరణలో జాప్యం జరిగింది. ప్రభుత్వాలు, అధికారుల మార్పుతో మందకొడిగా ఉండి.. ప్రస్తుతం ఊపందుకొంది.
కృష్ణపట్నం ఇండస్ట్రియల్ లెదర్ పార్కు
ప్రాథమికంగా కృష్ణపట్నం పరిసరాల్లో..
*537.96 ఎకరాలు 0
*ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదముద్ర లభించింది. త్వరలోనే ప్రాంతం ఎంపిక, భూసేకరణ మొదలుకానుంది. వాస్తవానికి పదేళ్ల కిందటే కోట వద్ద లెదర్ పార్కు ఏర్పాటుకు కసరత్తు జరిగింది. ప్రజలు వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియపై స్తబ్ధత ఏర్పడింది. ప్రస్తుతం మళ్లీ కొత్త ప్రాజెక్టుగా తెరపైకి వచ్చింది.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్
బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద
*సేకరించాల్సిన భూమి: 38.53 ఎకరాలు
*సేకరించింది: 0
*ప్రతిపాదనలు వెళ్లగా- ప్రభుత్వం ఆమోదముద్ర వేసి నిధులు మంజూరు చేసింది. ఇటీవలే శంకుస్థాపన సైతం జరిగింది. త్వరలోనే భూసేకరణ మొదలవుతుంది. గత ప్రభుత్వ హయాంలో కసరత్తు జరిగినా... ఎన్నికలు రావడంతో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం నిర్మాణ దిశగా అడుగులు
పడుతున్నాయి.
దగదర్తి విమానాశ్రయం
దగదర్తి మండలం దామవరం, కేకేగుంట
*1380 ఎకరాలు 1172 ఎకరాలు
*208 ఎకరాలకు సంబంధించి సమస్య ఉంది. కొన్నింటికి కోర్టులో కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ సంస్థను ఎంపిక చేసి.. సేకరించిన భూములను అప్పగించారు. పెండింగ్ భూమి పరంగా చొరవ చూపినా ఫలితం లేకపోయింది. ఇక్కడ పరిహారం, యాజమాన్య హక్కుల విషయమే ప్రధాన సమస్యగా ఉంది.
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను
గూడూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు రెవెన్యూ డివిజన్లలో 47 గ్రామాలు
*884.13 ఎకరాలు 250.36 ఎకరాలు
*633.77 ఎకరాలకు సంబంధించి 28 గ్రామాలకు అవార్డు దశలో ఉన్నాయి. మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్టు ప్రకటించిన ప్రారంభ సమయంలో నిధుల కేటాయింపులు అరకొరగా ఉండేది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం కావడంతో సమన్వయమూలోపించింది. ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ)
కోట మండలం చిట్టేడు, వాకాడు మండలం తూపిలిపాళెం
*211.74 ఎకరాలు 153.54 ఎకరాలు
*తూపిలిపాళెం వద్ద సేకరించిన స్థలం చుట్టూ కంచె వేసి షెడ్లు, కొన్ని భవనాలు నిర్మించారు. కోట మండలం చిట్టేడు వద్ద సేకరించిన స్థలంలో సిబ్బంది వసతి సముదాయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవన్నీ పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తున్నాయి. 58 ఎకరాలకు సంబంధించి కోర్టు కేసులు ఉండగా- అయిదేళ్లుగా ఈ కారణంగానే జాప్యం జరిగింది.
*జాతీయ రహదారి 167బీ విస్తరణ, చెన్నై- హౌవ్‌డా మూడో లైన్, నాయుడుపేట ఫర్నీచర్, సాఫ్ట్‌వేర్ పార్కు, ముత్తుకూరు టింబర్ క్లస్టర్, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) సైతం కీలకం కానున్నాయి.
పరిశ్రమలకు ప్రాధాన్యం
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నాం. ఆ క్రమంలోనే భూసేకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. పలు కొత్త ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపాదించి భూమిని సేకరిస్తున్న అంశాలకు సంబంధించి.. ప్రక్రియ వేగవంతం చేశాం. నెల్లూరును పారిశ్రామిక హబ్‌గా మరింత పరిపుష్ఠం చేయాలన్నదే లక్ష్యం. - కేవీఎన్ చక్రధర్‌బాబు, కలెక్టర్
ఇదీ చదవండి: