తిరుపతి ఉపఎన్నికల్లో వాలంటీర్లకు ఎన్నికల పెత్తనం ఇవ్వటం సీఎం జగన్‌కే చెల్లిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఒక్కో వాలంటీర్‌కు రూ.5 వేలు ఇచ్చి సుమారు రూ.11కోట్ల వరకూ నగదు పంపిణీ చేయించారని ఆరోపించారు. దీనిపై ఆయన నెల్లూరులో మాట్లాడారు. వాలంటీర్లే తనకు ఓట్లు వేయిస్తారని.. కార్యకర్తలు చూస్తూ ఉండండనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారని అన్నారు.
'కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి' - TDP politburo Somireddy Chandramohan Reddy latest news
తిరుపతి ఉపఎన్నికలో ముఖ్యమంత్రి.. వాలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీ చేయిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ప్రభుత్వ నిధులతో గౌరవ వేతనం ఇస్తూ.. వాలంటీర్లతో రాజకీయాలు చేయించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులను ఇదే రకంగా వాడుకుంటే వ్యవస్థలు ఏమైపోతాయని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఊరందూరులో తిరుపతి ఉప ఎన్నికల బహిష్కరణ!