Nellore District Crime News: నెల్లూరు జల్లా ఆత్మకూరులో మొద్దు పెంచలయ్య సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది.'నేను, నా భార్య చావుకు కొంతమంది కారణం అంటూ..' సెల్ఫీ వీడియో పెట్టిన పెంచలయ్య.. అనంతరం భార్య సమాధి వద్దే పురుగులమందు తాగాడు. అతని పరిస్దితి విషమంగా ఉండటంతో స్థానికులు నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.
గతంలో ఏం జరిగిందంటే..?
మూడు నెలల క్రితం మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తున్న కొండమ్మ.. ఇంట్లో ప్యాన్‌కి ఉరి వేసుకొని చనిపోవటాన్ని ఆమె భర్త పెంచలయ్య వీడియో తీశాడు. ఆ వీడియో అప్పట్లో కొందరికి పంపగా అది వైరల్ అయ్యింది. ఆ ఘటన రాష్ట్రంలోనే సంచలనంగా మారింది.