శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న వైద్యుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గురువారం తెల్లవారుజామున పోలీసుల కళ్లు గప్పి స్టేషన్ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కావలి డీఎస్పీ ప్రసాద్ ఉదయగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారణ చేశారు. వైద్యుణ్ని స్టేషన్లో ఉంచిన గదిని పరిశీలించి, రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది, స్థానిక సీఐ సత్యనారాయణతో మాట్లాడారు.
సిబ్బందిపై చర్యలు