శానిటైజర్లకు అలవాటుపడి నెల్లూరు జిల్లా ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ రమణయ్య (40) మృతి చెందాడు. ఉదయగిరి రజకవీధికి చెందిన రమణయ్య... నిత్యం పూటుగా మద్యం సేవించేవాడు. రెండు నెలలుగా మద్యానికి బదులు శానిరైజర్లు తాగడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శానిటైజర్లు తాగి అస్వస్థత..చికిత్స పొందుతూ అటెండర్ మృతి - sanitizers uses
శానిటైజర్లు తాగి అస్వస్థతకు గురైన అటెండర్ మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఉదయగిరికి చెందిన రమణయ్య(40) గత కొంత కాలంగా శానిటైజర్లు తాగుతూ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
a man dead in udyagiri nellore district due to drinking sanitizers