ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సోకిందనే భయంతో.. వ్యక్తి బలవన్మరణం - corona fear

కరోనా సోకిందనే భయంతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం నేలటూరులో జరిగింది.

corona fear death
కోరోనా భయంతో వ్యక్తి బలవన్మరణం

By

Published : May 10, 2021, 4:35 PM IST

కరోనా సోకిందనే భయంతో చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం నేలటూరులో జరిగింది. గ్రామానికి చెందిన పెండ్యాల కొండలరావు ప్రింటర్​గా పని చేసుకుంటూ గుంటూరులో జీవించేవాడు. అక్కడ కరోనా ఉద్ధృతి తీవ్రమవడం, పని తగ్గడం వంటి పరిస్థితులతో.. సొంతూరుకి తిరిగి వెళ్లాడు. ఈ క్రమంలో ఒళ్ళు నొప్పులతో పాటు తలనొప్పి, నీరసం సమస్యలతో బాధపడిన ఆయన.. ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నాడు.

తనకు కరోనా సోకిందేమో అన్న భయంతో ఆందోళన చెందాడు. ఉదయం వాకింగ్​కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అనంతరం గ్రామ సమీపంలోని పొలంలో తాడుతో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై మరిడి నాయుడు.. కుటుంబీకులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details