నెల్లూరు జిల్లా ఏయస్పేట మండలం జువ్వలగుంటపల్లి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన మేకల రామకృష్ణ అనే వ్యక్తి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తన భార్యను రోకలిబండతో కొట్టాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కాగా.. స్థానికులు వీరిని గమనించి ఆస్పత్రికి తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కలిగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మద్యం కోసం భార్యపై దాడి... అనంతరం ఆత్మహత్యాయత్నం
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని.. ఓ వ్యక్తి తన భార్యపై రోకలితో దాడి చేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా జువ్వలగుంటపల్లి గ్రామంలో జరిగింది. వీరిరువురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది.
మద్యం కోసం భార్యపై దాడి.. అనంతరం ఆత్మహత్యాయత్నం