నెల్లూరులో ఓ ముఠా నకిలీ టీవీలకు ప్రముఖ కంపెనీ బ్రాండ్‌ను ముద్రిస్తూ... పోలీసులుకు చిక్కింది. దిల్లీలోని చాందినీ చౌక్ వద్ద తయారైన అసెంబుల్డ్ టీవీలను తెచ్చి.... నెల్లూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కంపెనీ టీవీని కొంటే 50 వేలు ఖరీదు చేస్తుంది. అదే టీవీని నెల్లూరులోని నకిలీ వ్యాపారం చేసే ముఠా 20 వేల రూపాయలకే ఇస్తోంది. ఈ విషయంపై... ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంకటేశ్వరపురంలోని ప్లై ఓవర్ సమీపంలోని ఇంటిపై దాడి చేశారు. గోడౌన్లలో తనిఖీలు చేశారు. 72 టీవీలు, కంపెనీకి చెందిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 25 లక్షల రూపాయలు విలువ కలిగిన టీవీలు సీజ్ చేశారు. పటాన్ షబ్బీర్ ఖాన్, అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
నాణ్యమైన బ్రాండ్ల పేర్లతో... నకిలీ టీవీలు! - 25లక్షల నకిలీ టీవీలు
ప్రముఖ బ్రాండ్‌ను ముద్రించి నకిలీ టీవీలను విక్రయిస్తున్న ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 25 లక్షల రూపాయల విలువైన నకిలీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు.
నకీలి టీవీలను పట్టుకున్న పోలీసుుల