నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రామానాయుడుపల్లి బొగ్గేరు వాగు సమీపంలోని పొలంలో తలపనేని రమణయ్య అనే రైతు అనుమానాస్పద రీతిలో మరణించాడు. పోలీసులకు సమాచారం అందటంతో సీఐ, ఎస్ఐ వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు తెలుకున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కత్తి వెంకటేష్ అనే యువకుడు తరచూ తమ పొలంలోకి మేకలు తోలుతున్నాడనీ..రమణయ్య అతన్ని మందలించటంతో దాడి చేసి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రైతు - రైతు అనుమానస్పద మృతి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రామానాయుడుపల్లిలో ఓ రైతు మరణించాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాక్షులను విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ సోమయ్య తెలిపారు.
ఇదీ చదవండి: పదేళ్ల సరిహద్దు వివాదం.. త్వరలో తీరిపోయే సమయం!