tragedy : పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం - nellore-district crime
10:15 September 23
నెల్లూరు జిల్లా మోదుగులపాలెంలో విషాదం
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని మోదుగులపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు విషమిచ్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మేర్లపాక మురళి(40), తల్లి మస్తానమ్మ(60), కుమార్తె కావ్యశ్రీ(11)కి విషమిచ్చి ఆపై తానూ తాగాడు. గమనించిన స్థానికులు మురళి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే మస్తానమ్మ మృతి చెంది కనిపించింది. మురళి, కావ్యశ్రీని హుటాహుటిన సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. కావ్యశ్రీ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీచదవండి. Home minister: నేడు కొప్పర్రులో హోంమంత్రి సుచరిత పర్యటన