నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు గుడ్లదొన గ్రామంలోని చెరువుకు సోమశిల జలాలను ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. సచివాలయానికి విధలకు హాజరైన వారిని అడ్డుకున్నారు. ధర్నా నిర్వహించారు. ఎనిమిదేళ్లుగా నీళ్లు లేక పంటలు పండించుకునే స్థితి లేదన్నారు.
తమ సమస్యను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన లేదని ఆవేదన చెందారు. కనీసం పశువుల దాహం తీర్చేంచుకూ నీరు కరువైందన్నారు. మరమ్మతులకు గురైన ఎత్తిపోతల పథకాన్ని బాగు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సమీపం నుంచి వెళ్లే సోమశిల కాలువ జలాలను మళ్లించి చెరువును నింపాలన్నారు.