నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామానికి చెందిన బాలసుబ్రహ్మణ్యంరెడ్డి అనే కాంట్రాక్టర్ నాగాలాండ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలసుబ్రమణ్యంరెడ్డి తెలిసిన వారి దగ్గర ఆప్పులు చేసి నాగాలాండ్‌లోని ఓరియంటల్ కంపెనీలో కాంట్రాక్టు పనులు చేశారు.కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు 7 కోట్ల 97 లక్షల రూపాయలు. అడిగితె ఓరియంటల్ కంపెని యాజమాన్యం బెదిరించిందన్నారు. అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాలసుబ్రహ్మణ్యం ప్రధానికి లేఖ రాశారు. తన చావుకు ఓరియంటల్ సంస్థే కారణమని లేఖలో పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
బిల్లులు రాక నాగాలాండ్‌లో ఏపీకి చెందిన కాంట్రాక్టర్ ఆత్మహత్య
ఏపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ నాగాలాండ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనులకు సంబంధించి బిల్లులు విషయంలో తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. తన చావుకు కారణాలు తెలియజేస్తూ.. ప్రధానికి ఓ లేఖ రాసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఏపీకి చెందిన కాంట్రాక్టర్ నాగాలాండ్‌లో ఆత్మహత్య