Slab of Building Under Construction Collapsed: హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం పైకప్పులు కూలి పోయాయి. ఈ దుర్ఘటనలో శిథిలాలు మీద పడి ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహయ చర్యలు చేపట్టారు. నాసిరకం నిర్మాణం కారణంగానే భవనం పై కప్పులు కూలాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కూకట్‌పల్లిలో భవనం పై కప్పు కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. మరో కూలీ శిథిలాల కింద చిక్కుకున్నాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న డీఆర్ఎఫ్ అగ్నిమాపక పోలీసు సిబ్బంది శిథిలాలు తొలగిస్తున్నారు. కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనంలో మూడు అంతస్తుల వరకు పైకప్పుల నిర్మాణం కొద్దిరోజుల క్రితం పూర్తయ్యింది. కాగా.. నాలుగు, ఐదవ అంతస్తుకు ఇప్పుడు పై కప్పులు నిర్మిస్తున్నారు.