శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పేదలకు... 786 సేవా సంస్థ నిర్వాహకులు ఉచితంగా ఆవిరి పట్టే యంత్రాలను అందించారు. వీటిని 250 కుటుంబాలకు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలు వ్యాధి బారిన పడకుండా ఆవిరి పట్టి ఆరోగ్యంగా ఉండేందుకు వీటిని అందజేశామని నిర్వాహకులు షేక్ రఫీ అన్నారు. ఇలా మరో 250 కుటుంబాలకు సేవా సంస్థ తరపున అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
పేదలకు ఆవిరి పట్టే యంత్రాలు పంచిన నిర్వాహకులు - నాయుడుపేట తాజా వార్తలు
నాయుడుపేటలోని 786 సంస్థ నిర్వాహకులు షేక్ రఫీ పేదలకు వ్యాపరైజర్లు ఉచితంగా పంపిణీ చేశారు. పేదలకు వీటిని ఉపయోగించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన తెలిపారు.
పేదలకు వ్యాపరైజర్లు పంచిపెట్టిన 786 సంస్థ నిర్వాహకులు