నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్ దగ్గర స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తరలిస్తున్న రూ. 6 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. నిందితుడు బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన కమలాకర్ గా పోలీసులు గుర్తించారు.
నెల్లూరులో 556 మద్యం సీసాలు స్వాధీనం - 556 liquor bottles seized
నెల్లూరులో భారీగా మద్యం పట్టుబడింది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
556 మద్యం సీసాలు స్వాధీనం
అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావుకు అందిన సమాచారం మేరకు దాడి చేసినట్లు తెలిపారు. 556 మద్యం సీసాలను సీజ్ చేసిన్నట్లు వెల్లడించారు. అక్రమంగా మద్యం తరలింంచినా, విక్రయాలు చేసినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.