నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జాతీయ రహదారి వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుడివాడ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 21కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాని విలువ సుమారు లక్షా 47వేలు ఉండవచ్చన్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రెండు ఫోన్లు, రూ.3,500నగదు సీజ్ చేసినట్లు తెలిపారు.
వాహనాల తనిఖీ.. 21కేజీల గంజాయి పట్టివేత - seb official raids news
పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద ఎస్ఈబీ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 21కేజీల గంజాయి పట్టుబడింది.
గంజాయి పట్టివేత
నిందితులు ఇద్దరూ.. తమిళనాడుకు చెందిన వారని ఎస్ఈబీ అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో ఉండే చక్రపాణి అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి.. బెంగుళూరుకి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ తక్కువ ధరకు కొని.. బెంగుళూరులో ఎక్కువ ధరకి విక్రయిస్తున్నట్లు చెప్పారు. త్వరలో చక్రపాణిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి