గాలిపటాలు ఎగరేయాలన్న ఆ చిన్నారుల సరదా..వారి ఉసురు తీసేవరకూ వెళ్లింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గంగవరంలో గాలిపటాలు ఎగురవేస్తూ విద్యుతాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. 12ఏళ్ల రాజేష్, తొమ్మిదేళ్ల దినేష్ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. గాలిపటం ఎగరేస్తూ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లారు. అంతలోనే గాలిపటానికి విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నారులు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. అప్పటివరకూ ఆడుకుంటూ ఉన్న పిల్లలు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు .
విద్యుదాఘాతంతో ఇద్దరు చిన్నారులు మృతి - 2 kids died due to electricity shock
నెల్లూరు జిల్లాలో విషాదం జరిగింది. గాలిపటాలు ఎగరేయాలన్న ఆ చిన్నారుల సరదా..వారి ఉసురు తీసేవరకూ వెళ్లింది. విద్యుదాఘాతంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
2 kids died due to electricity shock