గ్రామ యోజన అవార్డుకు ఎంపికైన నెల్లూరు, తూ.గో. జిల్లాలు - ఏపీ 2021 తాజా వార్తలు

07:56 September 08
ఎస్సీలు ఉండే గ్రామాల్లో అభివృద్ధి, సామాజిక న్యాయం ప్రాతిపదికన అవార్డులు
ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామయోజన అవార్డుకు రాష్ట్రంలోని 2 జిల్లాలు ఎంపికయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలకు గ్రామ యోజన అవార్డులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వశాఖ రాష్ట్రానికి సమాచారమిచ్చింది. ఎస్సీలు ఉండే గ్రామాల్లో అభివృద్ధి, సామాజిక న్యాయం ప్రాతిపదికన అవార్డులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. గ్రామ యోజన అవార్డులకు దేశవ్యాప్తంగా 3 జిల్లాలు ఎంపికకాగా... ఏపీలోని నెల్లూరు, తూ.గో జిల్లాలు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.
ఇదీ చూడండి:RE ISSUE: ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయం