నెల్లూరు జిల్లాలో ఈ ఒక్కరోజే 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 21కు చేరింది. వీటిలో రాష్ట్రంలోనే మొదటిసారి నెల్లూరులో నమోదైన కేసుకు సంబంధించిన రోగి.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా... 20 మంది నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు నగరంలో 11 కేసులు, నాయుడుపేటలో 3, కావలిలో 2, బుచ్చిలో 1, ఇందుకూరుపేట నుంచి మరో కేసు నమోదైంది. వీరంతా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో సంబంధం ఉన్నట్టు తేలడంపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసి... రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.
నెల్లూరులో ఒక్కరోజే 18 కరోనా పాజిటివ్ కేసులు - నెల్లూరులో లాక్ డౌన్
నెల్లూరులో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జిల్లాలో ఒక్కరోజే 18 కేసులు నమోదయ్యాయి. వీరంతా దిల్లీలో మతప్రార్థనలకు వెళ్లివచ్చిన వారితో సంబంధాలను కలిగి ఉన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా.. జిల్లా యంత్రాగం లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
నెల్లూరులో ఒక్కరోజే 18 కరోనా పాజిటివ్ కేసులు.