ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని... దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. పోస్టల్ బ్యాంకును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేసిన వారికి... కౌన్ బనేగా బాహుబాలి, ఆజ్ కా బాద్ షా, సాక్షం గ్రామ్ పేరుతో అవార్డులను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అందజేశారు. మూడు విభాగాల్లో కలిపి రాష్ట్రానికి మొత్తం 14 అవార్డులు దక్కాయి. 10 అవార్డులు ఆజ్ కా బాద్ షా, రెండు కౌన్ బనేగా బాహుబలి, మరో రెండు సాక్షం గ్రామ్ కింద ఏపీకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సేవలను దేశమంతా ప్రారంభించింది. చిన్న మొత్తాల పొదుపు, ఉపాధి హామీ కూలీల వేతనాలు, భరోసా పింఛన్లు తదితర సేవలను అందించేందుకు పోస్టల్ బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించారు.
ఐపీపీబీ విభాగంలో రాష్ట్రానికి 14 అవార్డులు - ఇండియన్ పోస్ట్ ఫేమెంట్స్ బ్యాంక్
ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వార్షికోత్సవంలో, రాష్ట్రం నుంచి అత్యధిక ఐపీపీబీలో అకౌంట్స్ ఓపెన్ చేయించిన వారికి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా..అవార్డులు ప్రధానం చేశారు. రాష్ట్రం నుంచి 14 మంది ఈ అవార్డులు సొంతం చేసుకున్నారు.
![ఐపీపీబీ విభాగంలో రాష్ట్రానికి 14 అవార్డులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4385913-846-4385913-1568028687015.jpg)
12 మందికి ఐపీపీబీ అవార్డులు...
Last Updated : Sep 9, 2019, 9:36 PM IST